ePaper
More
    Homeక్రైంACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈఈ

    ACB Trap | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఏఈఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Trap | అవినీతి అధికారులు రోజు రోజుకు శృతి మించిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపల్​, రెవెన్యూ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కార్యాలయాల్లో బర్త్​​, ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ నుంచి మొదలు పెడితే అన్ని పనులకు లంచాలు తీసుకుంటున్నారు. రూ.500 నుంచి మొదలుకొని రూ.లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారు.

    ముఖ్యంగా మున్సిపల్​ కార్యాలయాల్లో (Municipal Offices) అయితే ఇంటి పర్మిషన్లు, ఇతర అనుమతుల కోసం చేతులు తడపనిదే పనులు చేయడం లేదు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా.. డబ్బులు ఇవ్వకపోతే అధికారులు కొర్రీలు పెడుతూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ మున్సిపల్​ ఏఈఈ (Municipal AEE) ఏసీబీ అధికారులకు చిక్కింది.

    మేడ్చల్​ మల్కాజ్​గిరి (Medchal Malkajgiri) జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం (Kapra Municipality)లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి ఏఈఈ స్వరూప కాంట్రాక్టర్​ను చేసిన పనులను ఎం బుక్​లో నమోదు చేయడానికి రూ.1.20 లక్షల లంచం అడిగింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఏఈఈ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయాలి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this