ePaper
More
    HomeజాతీయంInternational Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    International Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: International Education City | మహారాష్ట్రను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యకు కేంద్రంగా నిలిపేందుకు మహా సర్కారు కీలక చర్యలు చేపట్టింది. “ముంబై రైజింగ్” పేరిట భారతదేశంలో నవీ ముంబైని (Navi Mumbai) మొట్టమొదటి అంతర్జాతీయ విద్యా నగరంగా (international education city) తీర్చిదిద్దనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా, ముంబై, నవీ ముంబైలలో క్యాంపస్లను స్థాపించడానికి ఐదు అగ్రశ్రేణి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు (international universities) లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOIల) అధికారికంగా మంజూరు చేశారు. శనివారం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన LOI మంజూరు కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే (Eknath Shinde), అజిత్ పవార్ సహా అనేక మంది ఉన్నత స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు.

    International Education City | అగ్రశ్రేణి వర్సిటీలతో..

    రాష్ట్రంలో ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తున్న మహా సర్కారు (Maharashtra government).. అంతర్జాతీయ స్థాయిలో విద్యావనరులు సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ప్రపంచ అగ్రశ్రేణి వర్సిటీలను ఇక్కడికి ఆహ్వానిస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి అబెర్డీన్ విశ్వవిద్యాలయం, యార్క్ విశ్వవిద్యాలయం, అమెరికా నుంచి వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇటలీ నుంచి ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూరోపియో డి డిజైన్ (IED) ఉన్నాయి. ఆయా వర్సిటీలు వివిధ విభాగాలలో విద్యా నైపుణ్యం ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

    International Education City | సిడ్కో ఆధ్వర్యంలో..

    మహారాష్ట్ర ప్రభుత్వ (Maharashtra government) మార్గదర్శకత్వంలో సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనేజేషన్ CIDCO అంతర్జాతీయ విద్యా నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. “ఈ క్యాంపస్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ రకమైన విద్యా నగరం భారతదేశంలో ఇదే మొట్టమొదటిది. ఇక్కడ పది ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని”అని CIDCO అధికారి ఒకరు తెలిపారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...