ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | అగ్రస్థానంలోకి ముంబై.. ముగిసిన రాజస్థాన్ పోరాటం!

    IPL 2025 | అగ్రస్థానంలోకి ముంబై.. ముగిసిన రాజస్థాన్ పోరాటం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ MI జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌ RRను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాయింట్స్‌లో ముంబై ఇండియన్స్ అగ్రస్థానాన్ని top place కైవసం చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ playoffs రేసు నుంచి నిష్క్రమించింది.

    ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 4 పరాజయాలతో 14 పాయింట్స్‌తో టాప్‌లో కొనసాగుతోంది. ముంబై రన్‌రేట్(1.274) కూడా మెరుగ్గానే ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ముంబై అడుగు దూరంలో నిలిచింది. మరో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుండా.. మరో రెండు గెలిస్తే టాప్-2‌లో నిలవనుంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్(మే 6), పంజాబ్ కింగ్స్(మే 11), ఢిల్లీ క్యాపిటల్స్(మే 15)తో ఆడనుంది.

    IPL 2025 | ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?

    లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడుతాయి. ముందుగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫయర్-1 qualifer మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్  final చేరనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ eliminator మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2‌కు అర్హత సాధిస్తోంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతోంది. టాప్-2లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్-1 ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

    IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ ఔట్..

    మరోవైపు రాజస్థాన్ రాయల్స్ Rajasthan royals 11 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు చివరి 3 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ జట్టుకు కనీసం 16 పాయింట్స్ కావాలి. రాజస్థాన్ రాయల్స్ మూడింటికి మూడు గెలిచినా.. 12 పాయింట్స్ మాత్రమే వస్తాయి.

    Latest articles

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rain)...

    Chahal – Dhanashree | చాహల్ – ధనశ్రీ విడాకుల వ్యవహారం.. సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chahal - Dhanashree | టీమిండియా (Team India) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ yuzvendra chahal,...

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. 'భారత్ గౌరవ్'...

    TTD | టీటీడీ సిబ్బంది ప్రైవేటు కార్యకలాపాలు.. ముగ్గురు సిబ్బందిపై చర్యలు

    అక్షరటుడే, తిరుమల: TTD : నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బందిపై టీటీడీ కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా ముగ్గురు ఉద్యోగులపై చర్యలు...

    More like this