అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mumbai FCI AGM in CBI custody : మహారాష్ట్రలోని ముంబయికి చెందిన FCI, RO అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), ఒక వ్యాపారవేత్త, అతని కుమారుడు, సహచరుడు సహా నలుగురు నిందితులను CBI అదుపులోకి తీసుకుంది. ముంబయిలోని AGMకి రూ.20 లక్షల లంచం ఇచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా AGMతో సహా ముగ్గురిని CBI అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ కేసులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) శ్రీనివాసరావు మైలపల్లి, ఒక వ్యాపారవేత్త, అతని సహచరుడిని సైతం అరెస్టు చేసినట్లు CBI అధికారులు తెలిపారు. మైలపల్లి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిజ నిర్ధారణ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
