- Advertisement -
HomeUncategorizedMumbai Doctor | త‌ల్లికి ఫోన్ చేసి స‌ముద్రంలో దూకేసిన డాక్ట‌ర్.. వైద్యుడి కోసం కొనసాగుతున్న...

Mumbai Doctor | త‌ల్లికి ఫోన్ చేసి స‌ముద్రంలో దూకేసిన డాక్ట‌ర్.. వైద్యుడి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mumbai Doctor | ముంబైలో ఓ యువ వైద్యుడు(Mumbai Doctor) ఆత్మహత్య చేసుకునేందుక సముద్రంలో దూకేసిన ఘటన కలకలం రేపింది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు(Atal Setu)పై నుంచి 32 ఏళ్ల డాక్టర్ ఓంకార్ కవితాకే దూకేశాడు. ఆయ‌న వ‌య‌స్సు 32 ఏళ్లు కాగా, అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. పోలీసుల ప్రకారం, డాక్టర్ ఓంకార్ సోమవారం రాత్రి తల్లికి కాల్ చేసి “డిన్నర్‌కు వస్తున్నా” అని చెప్పి కొద్ది నిమిషాల వ్యవధిలోనే అటల్ సేతుపైకి వెళ్లి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఓ వాహనదారుడు దీనిని గమనించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు.

Mumbai Doctor | కార‌ణం ఏంటి?

తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంతెనపై ఆగి ఉన్న ఓ కారును గుర్తించారు. ఆ కారులోనే డాక్టర్ ఫోన్ కూడా లభించింది. అయితే అత‌ని కోసం కోస్ట్ గార్డ్ సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నవీ ముంబైలోని కలంబోలి(Kalamboli) ప్రాంతానికి చెందిన ఓంకార్, గత ఆరేళ్లుగా ముంబైలోని ప్రతిష్ఠాత్మక జేజే ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ ఘటనతో జేజే ఆసుప‌త్రి(JJ Hospital) సిబ్బంది అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిభావంతుడు, సేవాభావం క‌లిగిన యువ వైద్యుడు ఇలా అర్ధాంతరంగా జీవితం ముగించాలనే నిర్ణయం తీసుకోవడం స్థానికులను, సహచరులను తీవ్రంగా కలిచివేసింది. అస‌లు ఆయ‌నకు ప్రాణం తీసుకోవాల‌నే ఆలోచ‌న‌ ఎందుకు వ‌చ్చింది, మంచి వృత్తిలో ఉండి జీవితాన్ని ఇలా అర్ధాంత‌రంగా ముగించ‌డం ఏం బాలేదంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News