అక్షరటుడే, వెబ్డెస్క్: Tahawwur Rana | ముంబై ఉగ్రవాద దాడుల కుట్రలో కీలక నిందితుడైన తహవ్వూర్ రాణా (Tahawwur Rana)మంగళవారం పాటియాలా హౌస్ కోర్టును (House Court) ఆశ్రయించాడు. జ్యుడీషియల్ కస్టడీలో (judicial custody) ఉన్నప్పుడు తన కుటుంబంతో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశాడు. జైలు నిబంధనల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి తనకు సౌకర్యాలు కల్పించాలని మంగళవారం కోర్టును అభ్యర్థించారు.
Tahawwur Rana | రాణాను అప్పగించిన అమెరికా
అమెరికా పౌరుడు, 2008 ముంబై దాడుల (Mumbai attacks) ప్రధాన కుట్రదారులలో ఒకరైన డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి సన్నిహితుడైన రాణాను ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా ఇండియాకు అప్పగించింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ కోర్టు (Delhi court) ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి (judicial custody) పంపించడంతో భారీ భద్రత నడుమ రాణాను తీహార్ జైలుకు తరలించారు. NIA కస్టడీ గడువు ముగియడానికి ఒక రోజు ముందు ఆయనను ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ (Judge Chanderjit Singh) ముందు హాజరుపరిచారు.
జైలు వర్గాల కథనం ప్రకారం, రాణా తీహార్ జైలులోకి గేట్ నంబర్ నాలుగు ద్వారా ప్రవేశించాడు. జైలు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని అత్యంత ప్రమాదకర ఖైదీల కోసం రిజర్వు చేసిన రెండవ జైలులో ఉంచారు. “అతని సెల్ వెలుపల భద్రతా సిబ్బందిని నియమించారు. అతని కార్యకలాపాలు 24 గంటలూ పర్యవేక్షింస్తున్నట్లు” సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, అతని వసతి లేదా భద్రతా ఏర్పాట్లపై జైలు అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.