అక్షరటుడే, వెబ్‌డెస్క్: International smuggling case : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport – CSMI)లో కస్టమ్స్ అధికారులు (customs officials) నిర్వహించిన ఆపరేషన్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విమానాశ్రయంలో అరుదైన వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం జరుగుతుండగా, దానిని అధికారులు భగ్నం చేశారు. మే 31 (ఆదివారం)న థాయ్ ఎయిర్‌వేస్ విమానం(Thai Airways flight) నంబర్ TG317 ద్వారా ముంబైకి చేరుకున్న ఒక భారతీయ జాతీయుడిని అరెస్టు చేశారు. అతడిని అరెస్ట్ చేసి విమానాశ్రయంలో ఆపి విచారించారు. ఆ సమయంలో ప్రయాణీకుడు భయంగా, అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతని లగేజీని తనిఖీ చేశారు. అతడి నుంచి మొత్తం 52 అరుదైన జీవులు కనిపించాయి. అందులో కొన్ని సజీవంగా ఉంటే మరికొన్ని చనిపోయి ఉండడం గమనార్హం.
International smuggling case : ఏమేమి ఉన్నాయంటే..
ఆ యువకుడి దగ్గర స్పైడర్ టెయిల్డ్ హార్న్డ్ వైపర్ (సూడోసెరాస్టెస్ ఉరారాక్నోయిడ్స్) Spider-tailed Horned Viper (Pseudocerastes urarachnoides) 3 లివింగ్ (CITES అనుబంధం-II, వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్-IVలో జాబితా చేయబడింది). ఆసియన్ లీఫ్ టర్టిల్ (సైక్లెమిస్ డెంటాటా) Asian Leaf Turtle (Cychlemis dentata) 5 లివింగ్ (CITES యొక్క అనుబంధం-II, వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్-IVలో జాబితా చేయబడింది). ఇండోనేషియా పిట్ వైపర్ (ట్రిమెరెసురస్ ఇన్సులారిస్) Indonesian Pit Viper (Trimeresurus insularis) 44 (వీటిలో 43 సజీవంగా ఉన్నాయి, ఒకటి చనిపోయింది) ఇది CITES జాబితాలో చేర్చబడలేదు. పంచనామా ప్రకారం ఆ జీవులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సదరు వ్యక్తిని అరెస్టు చేసి ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ప్రమేయం ఇందులో ఉండే అవకాశం ఉందని కస్టమ్స్ విభాగం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కేసులో సదరు యువకుడితో పాటు మరికొందరి హస్తం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, నిందితుడు ఈ జీవులను ఎక్కడి నుండి తీసుకువచ్చాడు? ఎక్కడికి తీసుకెళ్లడానికి తెచ్చాడు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు