Mumaith khan | ఏంటి ముమైత్ ఖాన్ చావు బతుకుల వ‌ర‌కు వెళ్లొచ్చిందా.. బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయా?
Mumaith khan | ఏంటి ముమైత్ ఖాన్ చావు బతుకుల వ‌ర‌కు వెళ్లొచ్చిందా.. బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయా?

అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumaith khan | న‌టిగా, మోడ‌ల్‌గా actress and model ముమైత్ ఖాన్ Mumaith khan సినీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో special songs మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్ప‌టికింకా నా వ‌య‌స్సు నిండా ప‌ద‌హారు అనే పాట‌తో కుర్రకారుని ఉర్రూత‌లూగించింది. నటిగా, డ్యాన్సర్ గా ఓవైపు ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోవైపు ‘జలక్ దిక్లా జా 6’, ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ ‘Bigg Boss Telugu Season 1 వంటి తెలుగు రియాలిటీ షోల్లోనూ Telugu reality shows క‌నిపించి అల‌రించింది. ఇప్పటి వరకు 100 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది ముమైత్ ఖాన్. ప్రస్తుతం ముంబైలో Mumbai ఉంటున్నా.. తన తల్లి తమిళనాడుకు Tamil Nadu చెందినది కావడంతో అక్కడే అవ‌కాశాల కోసం ట్రై చేస్తుంది.

Mumaith khan | అలా ఎలా?

హిందీలో ‘హే క్యా హో రాహ హై’ చిత్రంలో ఐటెం సాంగ్ తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో Telugu films స్వామి, 143 వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత ఛత్రపతి, పోకిరి, యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వీడు మాములోడు కాదు, ఆటాడిస్తా, బుజ్జిగాడు, నేనింతే, మగధీర, గుండెల్లో గోదారి, డిక్టేటర్ వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ లో నటించి స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తాజాగా ముమైత్ ఖాన్ Mumaith khan ఓ యూట్యూబ్ ఛానల్ కి YouTube channel ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో త‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల Health issues గురించి చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం కూడా తన బిజినెస్ ప్రమోషన్స్ లో business promotions భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. ఇంట్లో డ్యాన్స్ వేస్తుంటే కాలు స్లిప్ అయి పడి బ్రెయిన్ లో నరాలు కట్ brain nerves cut అయిన‌ట్టు చెప్పింది.

సర్జరీ surgery త‌ర్వాత‌ 15 రోజులు కోమాలో ఉన్నాను, కొంత మెమరీ లాస్ memory loss అయింది అని చెప్పుకొచ్చింది. తన మెదడు Brainలో ఏడెనిమిది వైర్లు ఉన్నాయని నేను షూ లేస్ కట్టుకోవడం కూడా చాలా ప్రమాదకరం అని ముమైత్ ఖాన్ Mumaith khan చెప్పుకొచ్చారు. నేను బ్యాంకాక్ కు Bangkok స్టంట్ షో చేయడానికి వెళ్లానని అప్పుడే నేను స్వప్న దత్ కు చెప్పానని నేను ఉదయం లేవకపోతే నా పని అయిపోయినట్టే అని అన్నానని ముమైత్ ఖాన్ Mumaith khan చెప్పుకొచ్చారు. నా పరిస్థితి అంత దారుణంగా ఉండేదని నా ఆరోగ్య పరిస్థితిని health condition అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టిందని ముమైత్ ఖాన్ కామెంట్లు చేశారు. ఈ ఫీల్డ్ లో ఫేస్, ఫిట్నెస్ Face and fitness ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా మీద నేను ఫోకస్ చేసి గతంలో ఉన్నట్టు రెడీ అయి బ్యాక్ వచ్చాను అంటూ త‌న బాధ‌లు చెప్పుకొచ్చింది ముమైత్.