అక్షరటుడే, ఇందూరు: Mukkoti Ekadashi | ‘ఓం నమో నారాయణాయ.. ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా’.. అనే నామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని (Mukkoti Ekadashi) పురస్కరించుకొని మంగళవారం వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Mukkoti Ekadashi | ఉత్తరద్వార దర్శనాలు..
వేంకటేశ్వరాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ మందిరం (Jenda Balaji Temple), గంగాస్థాన్ ఉత్తర తిరుపతి, చక్రం గుడి, సుభాష్ నగర్ రామాలయం, ఖిల్లా రామాలయం, డిచ్పల్లి రామాలయం (Dichpally Ramalayam), గుండారం అనంత పద్మనాభ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిశాయి.

జెండా బాలాజీ ఆలయంలో కలెక్టర్ పూజలు..
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సుభాష్‌నగర్‌లోని రామాలయంలో స్వామివారి పల్లకీ సేవ ప్రత్యేకంగా నిలిచింది. మహిళలు భక్తులు దాండియా ఆటలతో అలరించారు. అలాగే నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయంలో ధర్మకర్తలు నర్సింగ్‌రావు, దిల్ రాజు పాల్గొని పూజలు నిర్వహించారు.
