అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ambani Diwali Gift | భారతీయుల కోసం దీపావళి Diwali పండగని ప్రత్యేకంగా మారుస్తూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ‘జియో గోల్డ్ 24K డేస్’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించారు. ఈ ఆఫర్ ద్వారా ఇంట్లో కూర్చుని 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్‌ను ఉచితంగా పొందే అవకాశముంది.
Ambani Diwali Gift | ప్రధాన విశేషాలు:
కనీసం రూ. 2,000 పెట్టి డిజిటల్ గోల్డ్ కొన్నవారికి 2% అదనపు గోల్డ్ ఉచితంగా లభిస్తుంది. ఉదాహరణకు, రూ. 2,000 పెట్టినవారు రూ. 40 విలువైన ఉచిత బంగారం పొందుతారు.
రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ గోల్డ్ కొనుగోలు చేసిన వారు ఆటోమేటిక్‌గా మెగా ప్రైజ్ డ్రాలో పాల్గొనడానికి అర్హత పొందుతారు. మొత్తం రూ. 10 లక్షల విలువైన ప్రైజులు, స్మార్ట్‌ఫోన్, టీవీ, గోల్డ్ కాయిన్స్, మిక్సర్ గ్రైండర్లు, గిఫ్ట్ వోచర్లు లభించనున్నాయి.
ఆఫర్ అక్టోబర్ 18న ప్రారంభమై, అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది.
Ambani Diwali Gift | డిజిటల్ గోల్డ్ కొనుగోలు విధానం:
- జియో ఫైనాన్స్ లేదా MyJio యాప్ ద్వారా కొనుగోలు చేయాలి.
- కొత్త యూజర్లు సైన్ అప్, పాత యూజర్లు లాగిన్ కావాలి.
- మొబైల్ నంబర్ లింక్ చేసి PAN కార్డు వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- డిజిటల్ గోల్డ్ సెక్షన్‌లో కనీసం రూ. 2,000 విలువలో కొనుగోలు చేయాలి. UPI లేదా ఇతర ఆప్షన్ల ద్వారా పేమెంట్ పూర్తి చేయవచ్చు.
Ambani Diwali Gift | డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?
డిజిటల్ గోల్డ్ Digital Gold అంటే భౌతిక బంగారం కాదు. కాగితం రూపంలో యాప్‌లో డిపాజిట్ అవుతుంది. భవిష్యత్తులో మీరు దీన్ని ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. కేవలం రూ. 10 నుంచి కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.ఈ దీపావళి సీజన్లో గోల్డ్ కొనుగోలు చేయడానికి ఇదొక సువర్ణావకాశం. 2% ఉచిత బంగారం, మెగా డ్రా లా బంపర్ రివార్డులు కల్పించే ఈ ఆఫర్ వినియోగదారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.