అక్షరటుడే, వెబ్డెస్క్ : Mukesh Ambani | భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా మరోసారి రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అవతరించారు. రూ.9.55 లక్షల కోట్ల సంపదతో ఆయన దేశంలోనే రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు.
తర్వాతి స్థానంలో రూ.8.14 లక్షల కోట్ల సంపదతో అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) రెండో స్థానంలో నిలిచారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజాగా వెలువరించిన 14వ ఎడిషన్ ప్రకారం.. గౌతమ్ అదానీ మొత్తం రూ. 8.15 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
Mukesh Ambani | మూడో స్థానంలోకి నాడర్ కుటుంబం..
ఈసారి విడుదలైన సంపన్నుల జాబితాలో కొన్ని కొత్త పేర్లు చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా(Roshni Nader Malhotra), ఆమె కుటుంబం మొదటిసారిగా టాప్ త్రీ ప్లేస్ లోకి వచ్చారు. ఆమె సంపద రూ. 2.84 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో భారతదేశంలో అత్యంత మహిళా ధనవంతురాలిగా రోష్ని నాడర్ నిలిచారు. అంతే కాదు, 44 ఏళ్ల మల్హోత్రా భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా, టాప్ 10 మందిలో అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు.
Mukesh Ambani | బిలియనీర్ అయిన షారుఖ్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) కూడా బిలియనర్ గా మారాడు. ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకున్న కింగ్ ఖాన్.. తొలిసారి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లో స్థానం సంపాదించాడు. అతడి సంపద నికర విలువ రూ. 12,490 కోట్లుగా అంచనా వేశారు. యువ వ్యాపారవేత్తలు సైతం ఈసారి ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. పెర్ప్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు, 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్ల నికర విలువతో భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (22) అతి పిన్న వయస్కుడైన ఎంట్రీ పొందాడు. అతని పార్టనర్ అదిత్ పలిచా (23) రెండో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ నిలిచాడు.
Mukesh Ambani | తగ్గిన సంపద..
అంబానీ, అదానీలతో పాటు రోష్ని నాదర్ మల్హోత్రా, సైరస్ ఎస్ పూనవాలా, కుమార్ మంగళం బిర్లా, నీరజ్ బజాజ్, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమ్జీ, గోపీచంద్ హిందూజా, రాధాకిషన్ దమానీ కుటుంబాలు టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయితే, టాప్ టెన్ జాబితాలో నిలిచిన వారిలో ఇద్దరు మినహా మిగతా వారి సంపదలో గతేడాది కంటే ఈసారి తగ్గుదల నమోదు కావడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ సంపద గతేడాది కంటే ఈసారి 6 శాతం, అదానీ సంపదలో 30 శాతం, పూనవాలా సంపద 15 శాతం తగ్గుదల నమోదు కావడం విశేషం. అదే సమయంలో నీరజ్ బజాజ్ సంపద 43 శాతం, అజీం ప్రేమ్ జీ ఆస్తుల విలువ 16 శాతం పెరుగడం గమనార్హం.
toko56 login