Homeబిజినెస్​Orkla India IPO | ఐపీవోకు ఎంటీఆర్‌ ఫుడ్స్‌ మాతృసంస్థ.. 29 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

Orkla India IPO | ఐపీవోకు ఎంటీఆర్‌ ఫుడ్స్‌ మాతృసంస్థ.. 29 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Orkla India IPO | ఎంటీఆర్‌ ఫుడ్స్‌(MTR Foods) మాతృసంస్థ అయిన ఓర్క్‌లా ఇండియా(Orkla India) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈనెల 29 న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది.నార్వేకు చెందిన ఓర్క్‌లా.. ఎంటీఆర్‌ ఫుడ్స్‌ పేరుతో ఇండియాలో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌(Food Products)ను విక్రయిస్తోంది.

అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్‌, పానీయాలు మరియు డెజర్ట్స్‌తోపాటు భోజనంలో ఉపయోగించే విభిన్న శ్రేణి ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సాంబార్‌ మసాలా(Sambar Masala), చికెన్‌ మసాలా, రసం మసాలా మీట్‌ మసాలా వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు, మిశ్రమ సుగంధ ద్రవ్యాలు, మిరప, పసుపు, కొత్తిమీర, జీలకర్ర పొడులు మరియు వివిధ వర్గాలలో 400 కంటే ఎక్కువ ఉత్పత్తులున్నాయి. కంపెనీ ఎంటీఆర్‌తోపాటు ఈస్టర్న్‌(Eastern), రసోయ్‌ మ్యాజిక్‌ బ్రాండ్ల పేరుతో తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. గులాబ్‌ జామున్‌ మిక్స్‌, రవా ఇడ్లీ మిక్స్‌, 3 నిమిషాల పోహా, దోశ మిక్స్‌ వంటి ఆహార ఉత్పత్తులను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోని 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 843 మంది పంపిణీదారులు, 1,800 మంది ఉప పంపిణీదారులను కలిగి ఉంది.

Orkla India IPO | రూ. 1,667.54 కోట్లు లక్ష్యం..

ఓర్క్‌లా సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఐపీవో(IPO) ద్వారా రూ.1,667.54 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. పూర్తి మొత్తాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) రూపంలోనే సమీకరించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.

Orkla India IPO | ఆర్థిక పరిస్థితి..

2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ(Revenue) రూ. 2,387.99 కోట్లు ఉండగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,455.24 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ప్రాఫిట్‌ ఆఫ్టర్‌ ట్యాక్స్‌(PAT) రూ. 226.33 కోట్లనుంచి రూ. 255.69 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆస్తులు(Assets) రూ. 3,375.19 కోట్లనుంచి రూ. 3,171.30 కోట్లకు తగ్గాయి.

Orkla India IPO | ప్రైస్‌బ్యాండ్‌

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity share) ధరను రూ. 695 నుంచి రూ. 730 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 20 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బ్యాండ్‌ వద్ద ఒక లాట్‌ కోసం రూ. 14,600తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Orkla India IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 160 గా ఉంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 21.9 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Orkla India IPO | ముఖ్యమైన తేదీలు..

ఐపీవో విండో ఈనెల 29న తెరచుకుంటుంది. 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ నవంబర్‌ 3వ తేదీన వెల్లడవుతుంది. కంపెనీ షేర్లు 6వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. కాగా యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం ఈనెల 28న విండో తెరుచుకోనుంది.