2
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని ఓ బార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. నగర శివారులోని అర్సపల్లి (Arsapally Bar) ఎమ్ఎస్ఆర్ బార్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనల మేరకు రిజిస్ట్రర్లు ఉండకపోవడం, డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో మధుశాల రెస్టారెంట్ అండ్ బార్ (Madhusala Restaurant and Bar) పేరుతో ఉన్న ఎమ్ఎస్ఆర్ బార్‌ను అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో దిలీప్, నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో బార్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశారు.