అక్షరటుడే, వెబ్ డెస్క్: Ms Dhoni | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న క్రికెటర్ ఎంఎస్ ధోని Ms Dhoni. ధోని క్రేజ్ మామూలుగా ఉండదు. ధోని క్రికెట్ గ్రౌండ్‌లో కనిపిస్తే చాలు అరుపులతో స్టేడియం మారుమోగాల్సిందే.
అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ఎంఎస్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్ విషయంలో తనకు కంగారు లేదని.. తనకు ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ధోని పేర్కొన్నాడు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలన్నాడు. మనం ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలన్నాడు. గుజరాత్‌పై గెలుపు అనంతరం ధోనీ మాట్లాడుతూ.. సీఎస్కే భవితవ్యం.. వీడ్కోలు విషయాలపై గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Ms Dhoni | అతడే నా వారసుడు..
“ఈ సీజన్ మాకు అనుకూలంచలేదు. బ్యాటింగ్ యూనిట్‌గా విఫలయం అయ్యాం. కానీ, ఈరోజు మా కుర్రాళ్లు ఖతర్నాక్ ఆడారు. నా విషయానికొస్తే ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ Retirement నిర్ణయంపై నేను తొందరపడడం లేదు. అలా అనీ నేను మరో సీజన్ ఆడుతాను అనిగానీ, ఆడను అనిగానీ చెప్పలేను. ఎందుకంటే.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. ప్రదర్శనను బట్టే వీడ్కోలు పలకాలి అనుకుంటే.. కొందరు క్రికెటర్ల కెరియర్ 22 ఏళ్లకే ముగుస్తుంది. అందుకే.. నేను హడావిడిగా ఏ నిర్ణయం తీసుకోను. సీజన్ ముగిసింది కాబ్టటి.. రాంచీకి వెళ్తాను. నాకు నచ్చినట్టుగా గడపాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన బైక్‌ల మీద చక్కర్లు కొడుతాను” అని ధోనీ వెల్లడించాడు.
సీజన్ ఆరంభంలో మా మొదటి నాలుగు మ్యాచ్‌లు చెన్నైలో జరిగాయని.. మేము బ్యాటింగ్‌ను రెండో ఇన్నింగ్స్‌కు వదిలేలా నిర్ణయించుకున్నామన్నారు. కానీ నాకు మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ బాగుందనే అనిపించిందన్నాడు. మా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ గురించి కొద్దిగా ఆందోళనగా ఉందన్నాడు. స్కోరు చేయగలగడం సాధ్యమే కానీ కొన్ని లోపాలను పూరించాల్సిన అవసరం ఉందన్నాడు. రుతురాజ్ వచ్చే సీజన్‌లో చాలా విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నాడు.
‘తర్వాతి సీజన్‌లో సీఎస్కే CSK సారథి ఎవరు?’ అనే ప్రశ్నకు ఇంకెవరు రుతురాజ్ ఉన్నాడుగా అని బదులిచ్చాడు ధోనీ. రుతురాజ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి గురించి ఆందోళన అవసరం లేదు. వచ్చే సీజన్ గురించి మేము మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. కెప్టెన్‌గా అతడు సీఎస్కేను మళ్లీ గాడిలో పెడుతాడని నమ్మకం నాకుంది అని మహీ భాయ్ తెలిపాడు. 17వ సీజన్ ముందు కెప్టెన్సీ వదులుకున్న ధోనీ.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశాడు.