Homeక్రీడలుMS Dhoni | రాంచీ వీధుల్లో ‘ఆర్మీ టచ్’ కారుతో ధోని కూల్ షో.. నెటిజ‌న్ల...

MS Dhoni | రాంచీ వీధుల్లో ‘ఆర్మీ టచ్’ కారుతో ధోని కూల్ షో.. నెటిజ‌న్ల క్రేజీ రియాక్ష‌న్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MS Dhoni | భారత క్రికెట్ చరిత్రలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ఎం.ఎస్.ధోనీ, మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సారి బ్యాట్‌తో కాదు.. అద్భుతమైన మోడిఫికేషన్‌తో హమ్మర్ కారులో రాంచీ వీధుల్లో (Ranchi Streets) దర్శనమిస్తూ వైరల్ అయ్యాడు.

ఐపీఎల్ సీజన్ తర్వాత ఎక్కువగా స్వస్థలమైన రాంచీలో కుటుంబంతో గడుపుతున్న ధోనీ (MS Dhoni), ఆ మధ్య తన బైక్ రైడింగ్‌ వీడియోలతో సోషల్ మీడియాలో హంగామా చేశాడు. ఇక ఇప్పుడు తన “హమ్మర్ H2 SUV” కారుతో (Hummer H2 SUV” Car) బయట కనిపించడంతో, ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు.

MS Dhoni | అందరి చూపు అటే..

ధోని హమ్మర్​ కారును చూసిన ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆశ్చర్యపోయారు. కారు పూర్తిగా “ఇండియన్ ఆర్మీ థీమ్”లో (Indian Army Theme) డిజైన్ చేయబడింది. ధోనీ హమ్మర్‌పై ఫైటర్ జెట్లు, ట్యాంకులు, ఆర్మీ శ్రేణులు, ప్యారా ట్రూపర్స్, విమానాల అద్భుత ఆర్ట్‌వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తిని తనదైన శైలిలో ప్రతి సందర్భంలో చూపించే ధోనీ, తన కారు రూపకల్పనలో కూడా అదే శ్ర‌ద్ధ‌ చూపించాడు. ఈ మోడిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ను, రాంచీలోని కారు డీటైలింగ్ స్టూడియో “(V8 Custom Studio)” ఫౌండర్ అచ్యుత్ కుమార్ స్వయంగా వెల్లడించారు. “ధోనీగారు స్పష్టంగా చెప్పారు. కారుకు ఆర్మీ థీమ్ కావాలి, అది గర్వంగా అనిపించాలి” అంటూ అచ్యుత్ మీడియాతో చెప్పారు.

ఈ డిజైన్‌ను 2024లో పూర్తి చేసినట్లు సమాచారం. ధోనీకి ఉన్న హమ్మర్ H2 ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు రూ.75 లక్షలు విలువ ఉంటుంది. ఈ ఆర్మీ థీమ్ మోడిఫికేషన్, ఆర్ట్‌వర్క్, కస్టమ్ ఫినిషింగ్ అన్నింటిని కలిపితే మొత్తం ఖర్చు రూ.80 లక్షల దాకా అయి ఉంటుంద‌ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాహనాలంటే ధోనీకి ఉన్న మక్కువ ఎక్కువ‌నే విష‌యం తెలిసిందే. ఏవైనా బైకులు, కార్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయంటే అవి త‌ప్ప‌క ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. తాజాగా మాత్రం ధోనీ తన హమ్మర్ కారుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇక ధోనీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, తన అభిమానుల కోసమే ప్రతి ఏడాది ఐపీఎల్‌లో మైదానంలో అడుగుపెడుతున్నాడు. మ‌రి ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌లో ధోనీ ఆడతాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.