అక్షరటుడే, ఇందల్వాయి: MRPS | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (mandakrishna Madiga) పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా నాయకులు ఛలో హైదరాబాద్ (Chalo Hyderabad) కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు కిష్టయ్య మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై (Supreme Court Chief Justice Gavai) జరిగిన దాడిని ఖండిస్తూ ఇందల్వాయి టోల్‌ప్లాజా నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని కాపాడుకునే క్రమంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వివరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం (Nizamabad Rural Constituency) నుంచి వందల సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తరలివెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధమాల నాగభూషణం, ధర్పల్లి మండల ఇన్‌ఛార్జి నక్క రాజేందర్, డిచ్పల్లి ఇన్‌ఛార్జి డప్పు నర్సయ్య, సిరికొండ మండల అధ్యక్షుడు దీపక్, శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.
