Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri | ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Kotagiri | ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు

కోటగిరి మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. నవంబర్ 17న ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొననున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు (MRPS leaders), కార్యకర్తలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపుర్ పోచిరాం మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సీజేఐపై (Supreme Court CJI) జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్​పై (Chief Justice BR Gavai) దాడి చేయడాన్ని హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. చలో ఢిల్లీలో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి భారీఎత్తున బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు. నవంబర్ 17న నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమం పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండలాల, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News