అక్షరటుడే, బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ తహశీల్దార్ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. రెండేళ్లు గడుస్తున్నా హామీని అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పింఛన్లను పెంచి.. మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.