అక్షరటుడే, కోటగిరి: Pothangal | తాగునీటి సమస్య(Drinking Water Problem)ను పరిష్కరించాలని కోరుతూ పోతంగల్ మండల కేంద్రంలోని వివిధ కాలనీల నిరసన తెలిపారు. గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని(MPDO Office) ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పర్యవేక్షించాల్సిన అధికారులు(Officers) పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు ఒడ్డే లక్ష్మి, మైసవ్వ, బజరంగ్, శంకర్, ముస్తఫా, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.