Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad MP | కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎంపీ పరామర్శ

Nizamabad MP | కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎంపీ పరామర్శ

నగరంలో ఇటీవల రౌడీ షీటర్​ రియాజ్​ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఎంపీ అర్వింద్​ పరామర్శించారు. ప్రమోద్ పెద్ద కుమారుడికి ప్రైవేటు విద్యాసంస్థలో ఉచిత విద్య అందించేలా చూస్తామన్నారు.

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Nizamabad MP | సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఎంపీ అరవింద్ (MP Arvind) సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో (MLA Dhanpal Suryanarayana Gupta) కలిసి ఎంపీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పెద్ద కుమారుడికి ప్రైవేటు విద్యాసంస్థలో ఉచిత విద్య అందించేలా చూస్తామన్నారు.

ఇందుకు ఆ విద్యాసంస్థ కూడా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ (gun culture) పెరుగుతుందని, దీన్ని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గన్ కల్చర్ ప్రోత్సహించకుండా చూడాలని కోరారు. అనంతరం రియాజ్​ను పట్టుకునే ప్రయత్నంలో గాయాలపాలైన ఆసిఫ్​ను పరామర్శించారు.