HomeUncategorizedBJP Rajya Sabha MP | వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ.. తీవ్ర దుమారం రేపుతున్న...

BJP Rajya Sabha MP | వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ.. తీవ్ర దుమారం రేపుతున్న జాంగ్రా వ్యాఖ్య‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP Rajya Sabha MP | బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా (BJP Rajya Sabha MP Ram Chandra Jangra) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో చిక్కుల్లో ప‌డ్డారు.

పహల్గామ్‌ ఉగ్ర దాడిలో (Pahalgam terror attack) వితంతువులుగా మారిన భార్యలనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులపై తిరిగి పోరాడాల్సి ఉండాల్సిందని ఎంపీ జాంగ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు (political turmoil) సృష్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై బీజేపీ (BJP) చ‌ర్య‌లు తీసుకుంటుందా..? లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

BJP Rajya Sabha MP | దిగ‌జారిన వ్యాఖ్య‌లు

ప‌హ‌ల్గామ్ దాడిలో (Pahalgam attack) వితంతులుగా మారిన మ‌హిళ‌ల‌నుద్దేశించి బీజేపీ ఎంపీ రామ్‌చంద‌ర్ జాంగ్రా (BJP MP Ram Chandra Jangra) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేవి అహల్యాబాయి హోల్కర్ (Devi Ahilyabai Holkar) జయంతి సందర్భంగా భివానీని సందర్శించిన ఆయ‌న అక్కడ జరిగిన సభలో జాంగ్రా ఈ మాటలన్నారు. భ‌ర్త‌ల ప్రాణాల కోసం ఉగ్ర‌వాదుల‌ను వేడుకునే బ‌దులు వారితో పోరాడాల్సి ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం క‌ల‌కం రేపుతోంది. “వారు (మహిళా పర్యాటకులు) పోరాడాలి. వారు పోరాడాల్సిందని నేను నమ్ముతున్నాను. దీనివల్ల తక్కువ ప్రాణనష్టం జరిగేది. పర్యాటకులందరూ అగ్నివీర్ అయితే వారు ఉగ్రవాదులను (Terrorists) ఎదుర్కొని చివరికి ప్రాణనష్టాన్ని తగ్గించేవారు. మన సోదరీమణుల్లో రాణి అహల్యాబాయి వంటి ధైర్య స్ఫూర్తిని మనం తిరిగి రగిలించాలి” అని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు.

BJP Rajya Sabha MP | కాంగ్రెస్‌, ఎస్పీ విమ‌ర్శ‌లు..

ఉగ్రవాద బాధితుల పట్ల ఎంపీ రామ్ చందర్ (MP Ram Chandra) వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. రోహ్‌తక్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా జాంగ్రా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవి తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్‌ (Senior Congress leader Jairam Ramesh) కూడా సదరు బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ నాయకులు భారత సైన్యాన్ని, అమరవీరులైన సైనికులను పదే పదే అవమానిస్తున్నారని, ఇది వారి “కుటిల బుద్ధికి ప్రతిబింబమని విమ‌ర్శించారు. మ‌రోవైపు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Samajwadi Party chief Akhilesh Yadav) కూడా దీనిపై స్పందించారు. రామచంద్ర జంగ్రా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాజకీయ పార్టీ కాదు, మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్న ఒక మురికి కూపమ‌ని విమర్శించారు.

Must Read
Related News