HomeతెలంగాణIndiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీ రఘునందన్​ కీలక లేఖ

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీ రఘునందన్​ కీలక లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma House Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలివిడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తియింది.

లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు. అయితే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ నాయకుల సూచన మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. పలు గ్రామాల్లో అనర్హులకు కూడా ఇళ్లు కేటాయించారని పలువురు ఆరోపించారు. అయితే అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు తెలిస్తే ప్రోసిడింగ్​లు రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గతంలోనే ప్రకటించారు. అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు అవకాశం కల్పించాలని తాజాగా మెదక్​ ఎంపీ రఘునందన్​రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)కి ఆయన లేఖ రాశారు.

లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా ఇవ్వాలని  బీజేపీ ఎంపీ రఘునందన్​ రావు(BJP MP Raghunandan Rao) డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగా ఎంపీలను కూడా ప్రజలే ఎన్నుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలకు లబ్ధిదారుల ఎంపికలో అవకాశం కల్పించాలని డిమాండ్​ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన(Prime Minister Awas Yojana) నిధులను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వినియోగిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్‌ వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News