అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Raghunandan | మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎంపీకి కాల్ చేసిన అగంతకుడు హైదరాబాద్‌లో ఉన్నామని, సాయంత్రంలోగా చంపేస్తామని హెచ్చరించారు. 94043 48431 నుంచి ఫోన్ చేసిన అగంతకుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరని, కచ్చితంగా హత్య చేస్తామని బెదిరించారు. బీజేపీ సీనియర్ నాయకుడు రఘునందన్‌రావుకు బెదిరింపు కాల్స్ (Threatening Calls) రావడం ఇది ఆరోసారి.
MP Raghunandan | భద్రత పెంపు..
ఎంపీ రఘునందన్‌రావుకు (MP Raghunandan Rao) ఇటీవల తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా వచ్చిన కాల్‌తో ఇది ఆరోసారి కావడం గమనార్హం. గతంలోనూ ఇలాగే బెదిరింపులు వచ్చాయి. తాము మధ్యప్రదేశ్ మావోయిస్టులమని, ఆపరేషన్ ఖగర్‌ను (Operation Kagar) నిలిపి వేయకపోతే నిన్ను లేపేస్తామని బెదిరించారు. నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. ఇలా పలుమార్లు ఫోన్ కాల్స్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆయనకు భద్రతను పెంచింది. మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ రావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, రఘునందన్‌రావుకు అదనపు భద్రత(Extra Security) కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది. పర్యటనల సమయంలో పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.