HomeUncategorizedYS Jagan | రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ : వైఎస్​ జగన్​

YS Jagan | రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ : వైఎస్​ జగన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్​రెడ్డి (Mithun Reddy)ని అరెస్ట్​ చేశారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan)​ ఆరోపించారు. మిథున్​రెడ్డి అరెస్ట్​ను ఆయన ఖండించారు. లిక్కర్​ స్కామ్ (Liquor Scam)​ కేసులో మిథున్​రెడ్డిని శనివారం సిట్​ అధికారులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి ఆగస్టు 1 వరకు రిమాండ్​ విధించారు. ఆయన అరెస్ట్​పై వైఎస్​ జగన్​ ఎక్స్​ వేదికగా స్పందించారు.

YS Jagan | తప్పుడు కేసులో ఇరికించారు

ఎంపీ మిథున్‌రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారని జగన్​ అన్నారు. ప్రజల కోసం పోరాడే వారిని నోరు మూయించడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఇలా చేస్తోందన్నారు. మద్యం కుంభకోణం ప్రజా సమస్యల నుంచి తప్పుదోవ పట్టించడానికి తెర మీదకు తెచ్చారన్నారు.

YS Jagan | బెల్ట్​ షాపులు తెరుస్తున్న ప్రభుత్వం

మద్యం కుంభకోణంపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తమ హయాంలో రద్దు చేసిన బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను పునరుద్ధరిస్తోందని జగన్​ అన్నారు. వైసీపీ (YCP) హయాంలో వేలాది బెల్ట్​ షాపులు మూసివేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు తెరిచి ఎంఆర్​పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముకునేలా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

అవినీతి కేసులో బెయిల్​పై ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర దర్యాప్తు సంస్థలను, మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు ముసుగులో వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి సిట్​ను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసలు విచారణ ప్రారంభమైన తర్వాత నిజం బయటపడుతుందన్నారు.