అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి వచ్చారు. గతంలో ఒకసారి ఆయనను అధికారులు విచారించారు. తాజాగా ఆరు గంటల విచారణ తర్వాత మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
లిక్కర్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి కీలకంగా ఉన్నట్లు సిట్ (SIT) గుర్తించింది. ఆయనకు చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా.. అక్కడ కూడా చుక్కెదురు అయింది. దీంతో మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా.. అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను రేపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది.