అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Kalyan Banerjee | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి ధన దాహానికి సామాన్యులతోపాటు మహామహులు కూడా బలి అవుతున్నారు. తాజాగా వీరి చెరలో ఏకంగా పార్లమెంటు సభ్యుడు ఒకరు చిక్కుకోవడం సంచలనంగా మారింది.
తాజాగా తృణమూల్ పార్టీ (Trinamool Party) కి చెందిన సీనియర్ నేత, ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఆయన బ్యాంకు అకౌంట్లోకి చొరబడి రూ.56 లక్షలు మాయం చేశారు.
MP Kalyan Banerjee | హైకోర్టు శాఖ..
పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఈ ఘటన వెలుగుచూసింది. సెరంపూర్ లోక్‌సభ నియోజకవర్గ Serampore Lok Sabha constituency సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
కోల్‌కతాలోని హైకోర్టు శాఖ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి సైబర్ నేరగాళ్లు చొరబడి రూ.56 లక్షలు కాజేశారు. కోల్‌కతా సైబర్ క్రైమ్ సెల్‌కు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
బ్యాంకు అధికారుల ఫిర్యాదు ప్రకారం పరిశీలిస్తే.. గత నెల (అక్టోబరు 28న) ఓ సైబర్ నేరగాడు నకిలీ పాన్, ఆధార్ కార్డు నంబరు, సూపర్ ఇంపోజ్డ్ ఫొటోతో ఎంపీ బెనర్జీ ఖాతాను అప్డేట్ చేశాడు.
ఇందుకు సైబర్ నేరగాడి ఫోన్ నంబరును వినియోగించడంతో ఖాతాపై పూర్తి నియంత్రణ పొందాడు. తదుపరి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సుమారు రూ. 56,39,767ను దొంగిలించాడు.
ఈ మొత్తాన్ని పలు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. కొంత నగదును ATMల ద్వారా డ్రా చేసి, ఆభరణాలను కొనుగోలు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
