అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Arvind | బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూశారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూశారని గతంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (BJP MP CM Ramesh) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. తాజాగా ఎంపీ అర్వింద్ దీనిపై ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ (BRS) విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. అలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. సీఎం రమేశ్ మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ఆయన టీడీపీలో గెలిచి బీజేపీలో చేరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తెలంగాణతో సంబంధం ఏమిటని అర్వింద్ ప్రశ్నించారు.
MP Arvind | మా నాన్నకు ఇష్టం లేదు
తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయం తన తండ్రితో చర్చించలేదని అర్వింద్ తెలిపారు. తాను బీజేపీలో చేరడం ఆయనకు ఇష్టం లేదన్నారు. అయితే చిన్నప్పటి నుంచి బాల్‌థాకరే అభిమానిని కావడంతో బీజేపీలో చేరానని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తాను సైతం ఆశించినట్లు ఆయన చెప్పారు. అయితే తన మీద ఫిర్యాదులు వెళ్లడంతో పదవి రాలేదన్నారు.
MP Arvind | పార్టీపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో పార్టీ అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ (MP Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులే లేరని ఆయన అన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో పార్టీ సిద్ధాంతం నుంచి వచ్చింది ఒక్క ధన్పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana) మాత్రమే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇంకా కొంచెం కష్టపడి ఉంటే బీజేపీ 12 ఎంపీ సీట్లు సాధించి ఉండేదన్నారు. ఈటల రాజేందర్ (Eatala Rajender) బీజేపీ ఐడియాలజీ నుంచి వచ్చిన వ్యక్తి కాదన్నారు. ఆయన సీనియర్ నాయకుడని, తాము గౌరవిస్తామన్నారు.