అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్ (MP arvind) జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు (MLc Kavitha) కాళేశ్వరం (Kaleswaram) అవినీతి, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్‌ను అంటగడుతూ.. జైల్లో వేయాలని ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని ఖండించారు. అర్వింద్‌కు నీతి, నిమయాలు లేవన్నారు. ముందుగా ఆయన భాష మార్చుకోవాలని సూచించారు.
