అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జిల్లాలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జిల్లా పరిస్థితిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అధికారులను ఆరా తీశారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సిరికొండ (Sirikonda), ధర్పల్లి (Darpally), ఇందల్వాయి మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్నదని.. పలు గ్రామాలు నీట మునిగిపోయిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వినాయక చవితి (Vinayaka chavithi) పండుగ సెలవు రోజు అయినప్పటికీ అధికారులు బాధ్యతతో పనిచేశారని, రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి కనీస సౌకర్యాలు అందించాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంటనష్టంపై వివరాలు సేకరించి నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు.
MP Arvind | సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తా..
పార్లమెంటు పరిధిలో నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోం శాఖకి సైతం నివేదిస్తానని ఎంపీ తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అధికారులకు సహకరించాలని కోరారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలన్నారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.