అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఎన్నికల్లో తమ ప్రతినిధులను నిలబెడితే ప్రజలు ఆదరించి గెలిపించారని, అది సరిపోతుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఇక మాకు మ్యాజిక్ ఫిగర్ అవసరం లేదన్నారు. పదవి కోసం తాము ఎవరినీ కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. తమ భావాజాలం నచ్చి వస్తే.. ఆహ్వానిస్తామన్నారు. అంతకు మించి ఎవరికీ రూపాయి ఇచ్చేది లేదని ఎంపీ అర్వింద్ అన్నారు.
MP Arvind | పట్టు నిలుపుకొన్న అర్వింద్..
ఎంపీ అర్వింద్ నిజామాబాద్ నగరంలో పట్టు నిలుపుకొన్నారు. గతంలో నిజామాబాద్ నగర పాలక సంస్థ పాలకవర్గం ఎన్నికల సమయంలో 28 మంది కార్పొరేటర్లను ఎంపీ గెలిపించుకున్నారు. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే ఫిగర్‌ను సుస్థిరపర్చుకున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ (Nizamabad BJP) 28 డివిజన్లను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ దూరం కావడంతో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. కానీ, తాము ఎవరినీ కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారు. డబ్బులు పెట్టి సంపాదించే అధికారం తమకు అవసరం లేదన్నారు. కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు కాదు కదా.. రూ. 2 కూడా ఇవ్వనన్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే ఆహ్వానిస్తామన్నారు.