అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Dharmapuri Arvind | పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై (MP Dharmapuri Arvind) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘పీసీసీ అధ్యక్షులు (PCC President Mahesh Kumar Goud) నా గురించి మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నించారని.. చర్చించడానికి గాంధీ చౌక్‌కు రావాలన్నారని.. కానీ మీ ఇంటికే వస్తానని.. చర్చిద్దామని’ పేర్కొన్నారు. ‘నేడు ముఖ్యమంత్రి నిజామాబాద్‌కు వస్తున్నారు కదా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని’ సవాల్ విసిరారు.
మహిళలకు రూ. నాలుగువేల పెన్షన్, తులం బంగారం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా అసంపూర్తిగానే అమలు చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్షిప్లు ఎంత మందికి మంజూరు చేశారో చెప్పాలన్నారు. 18 ఏళ్లు పూర్తయిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, దివ్యాంగులకు రూ. 6వేల పెన్షన్ ఏమయ్యాయని.. చివరికి దివ్యాంగులను కూడా మోసం చేశారని మండిపడ్డారు.
MP Dharmapuri Arvind | ఆ పదాలకు స్పెల్లింగ్ కూడా తెలియదు..
ఎన్‌హెచ్–44పై ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్త చేశారు. ‘కనీసం ముఖ్యమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయల్ స్పెల్లింగ్ కూడా తెలియదు. ఆటోడ్రైవర్లను కూడా మోసం చేశారు. 50 ఏళ్లు దాటిన జానపద కళాకారులకు రూ. 3వేల పెన్షన్, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో బస్తీ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హామీలు ఎక్కడ అమలు చేశారంటూ విరుచుకుపడ్డారు. మూతపడిన 6వేల పాఠశాలలను మెరుగైన సౌకర్యాలతో పున:ప్రారంభిస్తామన్నారు.. ఎక్కడ ప్రారంభించారో చెప్పాలి. నాలుగు త్రిబుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు.. ఉన్న వాటికి దిక్కులేదు.. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు కదా.. ఇచ్చారా అని ప్రశ్నించారు.
MP Dharmapuri Arvind | ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
మీరు ఇచ్చిన హామీలపై తాను ప్రశ్నిస్తున్నానని.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అర్వింద్ సవాల్ విసిరారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఎందరికి ఇచ్చారు.. ఆరోగ్య బీమా ఏమైంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుందామంటే వెబ్సైట్ బంద్ ఉంది.’ ఇలా హామీలు అన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. వీటికి ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇందూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు.
2 comments
[…] చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) తెలిపారు. జిల్లా కేంద్రంలోని […]
[…] ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) వినాయక్ నగర్లో, పీసీసీ అధ్యక్షుడు […]
Comments are closed.