అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎంపీ అర్వింద్ నెరవేర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh) అన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఛైర్మన్ పదవిని కూడా జిల్లాకు చెందిన వ్యక్తికే ఇప్పించారని గుర్తు చేశారు. అలాగే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (Turmeric Board Central Office) కూడా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ నెలాఖరులో కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజలు సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.