అక్షరటుడే, ఇందూరు : Nizamabad Municipal Politics | పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud)కల్మా చదివి ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ (Indore Municipal Corporation)లో ప్రతిపక్ష స్థానంలో ఉండి అర్బన్ అభివృద్ధి కోసం పోరాడుతామని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Nizamabad Municipal Politics | ఇందూరులో భారీ విజయం..
ఎంపీ మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణులు తమ డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయాశక్తులా కృషి చేశాయన్నారు. అలాగే అర్బన్‌లో 28 సీట్లు సాధించడం అనేది భారీ విజయంగా భావిస్తున్నామన్నారు. ఏ పార్టీతోనూ పొత్తుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
Nizamabad Municipal Politics | బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కడున్నాడు..
కౌంటింగ్ ముగియగానే కాంగ్రెస్ నీచ రాజకీయాలు ప్రారంభించిందని.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. పోలీసుశాఖ (Police Department) సైతం సదరు కార్పొరేటర్ ఇంటి వద్ద ఒక ఏసీపీ, నలుగురు ఎస్సైలను బందోబస్తుగా ఉంచడం అధికార పార్టీకి మద్దతు తెలిపినట్లేనన్నారు. ఇందూరులో నీచ రాజకీయాలకు ఇది తార్కాణంగా నిలుస్తోందన్నారు.
Nizamabad Municipal Politics | సీఎంపై ఓటుకు నోటు కేసు ఏమైంది..
అర్బన్‌లో పోలింగ్‌లో భాగంగా తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని అర్వింద్ అన్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఓటుకు నోటు కేసు ఉండగా ఇన్నేళ్లుగా దానిని ఎందుకు బయటకు తీయట్లేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా నశించిందన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో కార్పొరేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్టీకి పూర్తి సంతృప్తిని ఇచ్చాయని ఆయన అన్నారు. అర్బన్‌లో బీఆర్ఎస్ను పూర్తిగా ఊడ్చేశామన్నారు. రాయికల్, మెట్పల్లిలో బీజేపీ స్థానాలను నిలబెట్టుకుందన్నారు. కోరుట్లలో సైతం ముందు వరుసలో ఉన్నామన్నారు.
Nizamabad Municipal Politics | కౌన్సిలర్‌గా గెలవని పీసీసీ చీఫ్
కౌన్సిలర్‌గా కూడా గెలవని పీసీసీ చీఫ్ గురించి ఎంత మాట్లాడిన తక్కువేనని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడుతూ రావ్లు, రెడ్డిలు ఎవరైనా ఎంఐఎం కాళ్ల వద్దకు రావాలని సభాముఖంగా పేర్కొన్నారన్నారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కలిసి మేయర్ పీఠం కోసం ప్రయత్నం చేయడాన్ని ఇందూరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎంతో జతకట్టాలని అనుకుంటే పీసీసీ చీఫ్ కల్మా చదివి వారితో పొత్తు పెట్టుకోవాలన్నారు. . కరీంనగర్లో బండి సంజయ్ (Bandi Sanjay) పోరాడారని.. కేవలం నాలుగు సీట్లుతో వెనుక పడ్డారన్నారు. ఇందూరులో తాను మూడు సీట్లతో వెనుకబడ్డామని అయినప్పటికీ వచ్చిన ఫలితాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తదితరులు పాల్గొన్నారు.