అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: MP Arvind campaign | బీజేపీకి పట్టంకట్టి అభివృద్ధికి సహకరించాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. 39వ డివిజన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో (Corner meeting) ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
MP Arvind campaign | 39వ డివిజన్ అభివృద్ధికి కృషి..
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 39వ డివిజన్ అభివృద్ధికి బీజేపీ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. బీజేపీ కార్పొరేటర్ల ద్వారా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నగరంలో (Nizamabad Municipality) అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సహకారంతో ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో ఆయా డివిజన్లను అభివృద్ధి చేసుకుందామని ఆయన పేర్కొన్నారు.
ప్రజల మధ్యే ఉండి సేవచేస్తా..
అనంతరం 39వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి దాంపల్లి జ్యోతి మురళికృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల మధ్యే ఉండి ఎల్లవేళలా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ‘మన ఇందూరు – మన మేయర్’ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్పొరేటర్‌గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.