Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arvind Ukraine Group | పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (MP Arvind Dharmapuri) నియమితులయ్యారు. ఈ గ్రూప్ ద్వారా భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ (Parliamentary) స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అర్వింద్ టీం లీడర్ గా ఉన్న ఈ గ్రూపులో ఎంపీలు రంజన్ గొగోయ్, లక్ష్మీకాంత్ పప్పు నిషాద్(SP), అమర్ శరద్రావ్ కాలే (NCP-SP), ఖలీలుర్ రహమాన్ (AITC), హనుమాన్ బేనివాల్ (RLP), ప్రభా మల్లికార్జున్ (INC), శివమంగళ్ సింగ్ తోమర్ (BJP), ఐ.ఎస్. ఇన్‌బదురై (AIADMK), రణదీప్ సింగ్ సుర్జేవాలా (INC), సదానంద్ మ్హాలు తనవాడే (BJP) సభ్యులుగా ఉన్నారు.
ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజులకు ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా తెలంగాణ నుంచి కువైట్ టీం లీడర్​గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒమన్ టీం లీడర్​గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపికయ్యారు.

Related articles

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది

Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.