అక్షరటుడే, ఇందూరు: Minister Vivek | మాలలకు 12 నుంచి 18 శాతం రిజర్వేషన్ వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ (AICC) దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి (Minister Vivek Venkata Swamy) తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఉన్న ఫంక్షన్ హాల్లో వెంకట స్వామి జయంతి, మాలల ఐక్య వేదిక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాలలంతా ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. తన తండ్రి జయంతి వేడుకలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
Minister Vivek | పొన్నం, లక్ష్మణ్ ఎపిసోడ్లో నేను లేను..
ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన సమయంలో తాను స్టేజీ నుంచి వెళ్లిపోవడం జరిగిందని మంత్రి వివేక్ అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. రోస్టర్ విధానం వల్ల ప్రభుత్వ మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కొందరు మాల జాతిని కించపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని వాటిని తిప్పి కొట్టాలంటే ఐక్యంగా ఉండాలన్నారు. మాలల వర్గీకరణ కోసం నిరంతరంగా పోరాడుతూనే ఉంటానన్నారు.
Minister Vivek | అంబేడ్కర్ సూక్తులను పాటించాలి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Ambedkar) చెప్పిన విధంగా బోధించు.. సమీకరించు.. పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు (MLA Nagaraju) అన్నారు. తాను జిల్లాలో సీపీగా పనిచేసే సమయంలో అందరూ సహకరించారని గుర్తు చేశారు.
కానీ రాజకీయాల్లో కులవివక్షత కొనసాగుతుందని దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకు ఐక్యత ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం గ్రూప్ 1,2 లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా మాల మహానాడు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే నాగరాజును సన్మానిస్తున్న మాలమహానాడు సంఘం నాయకులు