అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief | కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో (Gandhi Bhavan) ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విసృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి , పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ సూచన మేరకు జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేస్తామన్నారు.
PCC Chief | గ్రామసభలు
సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేది వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పతనం వివరిస్తూ ప్రతి నియోజక వర్గానికి 5 వేల చొప్పున కర పత్రాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీ రామ్ జీ చట్టం పేదల హక్కులు కాలరాసేలా ఉందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యత గలదని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. డీసీసీ ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.