అక్షరటుడే, ఇందూరు: PRTU Telangana | గురునానక్ (Guru Nanak) బోధనలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్‌సింగ్ అన్నారు. ఈనెల 5న గురునానక్ జయంతి పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో (Kanteshwar Primary School) విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వమత సమానత్వమే మానవత్వమని గురునాన బోధించినట్లు గుర్తు చేశారు. ప్రతిఒక్కరూ కరుణ, దయ, క్షమాగుణం పెంపొందించుకోవాలని, నిరుపేదలకు సేవ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
