HomeUncategorizedViral Video | పాము ప‌డ‌గ‌పై కూర్చున్న ఎలుక‌.. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసిందిగా..!

Viral Video | పాము ప‌డ‌గ‌పై కూర్చున్న ఎలుక‌.. ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసిందిగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | ఎలుకలు మనకు చిన్నవిగా క‌నిపించినా, వాటి తెలివితేటలు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. పాములు, పిల్లుల వంటి శత్రువుల నుండి ప్రాణాలను కాపాడుకోవడంలో ఇవి చూపించే వ్యూహాలు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి.. తాజాగా ఒక ఎలుక తన ప్రాణాలను ఎలా రక్షించుకుందో చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక ఎలుక నాగుపాము(Snake) తలపై కూర్చుని ఉంది. పాము ఎలుక(Rat)ను పట్టుకుని తినాలని చుట్టూ వెతుకుతున్న సమయంలో… ఎలుక మాత్రం అదే పాము తలపై నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.

Viral Video | పెద్ద రిస్కే..

పాము ఎలుకను ఎక్కడెక్కడో వెతుకుతుండగా, ఎలుక మాత్రం తన దారి సురక్షితంగా ఎంపిక చేసుకుంది. పాము కదులుతున్న దిశను అనుసరిస్తూ దాని తలపై నిలిచిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చ‌ర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను శిఖర్ బరన్వాల్ అనే యూజర్ ట్విట్ట‌ర్‌(Twitter)లో షేర్ చేశారు. ఈ వీడియో వేలాది మందిని ఆకట్టుకుంది. వీడియోను చూసిన నెటిజన్లు ఎలుక తెలివితేటను ప్రశంసిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎలుక‌ తెలివితేటలు మాములుగా లేవు.. ఎలుకకు బ్రెయిన్ ఎక్కువ” అని ఓ యూజర్ రాశారు.

ఊపిరి మిగిలి ఉన్నంత వరకూ ఆశ బతికే ఉంటుంది అని మ‌రో నెటిజ‌న్ రాసుకొచ్చాడు. ఇంకో యూజ‌ర్.. మరణం కాళ్లకింద ఉన్నా.. ఆయుష్షు ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో(Viral Video)ను చూసినవారంతా ఒక్క మాట చెబుతున్నారు . సంఘటన చిన్నదైనా, జీవితం గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని అంటున్నారు. ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యను చూసే కన్నా, దాని పైనే నిలబడి పరిష్కారం వెతకడమే ఉత్తమ మార్గమని ఈ ఎలుక నిరూపించింది. ఈ వైరల్ క్లిప్‌ ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఎలుక తెలివితేట‌ల‌ని ప్రశంసించకుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయితే చివ‌రికి ఎలుక పాము నుండి త‌ప్పించుకొని వెళ్లిందా, లేక బ‌లైందా తెలుసుకోవాల‌ని ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.