Homeజిల్లాలునిజామాబాద్​Traffic SI | వాహనదారుడి​ నిర్లక్ష్యం.. ఎస్సైకి తీవ్రగాయాలు

Traffic SI | వాహనదారుడి​ నిర్లక్ష్యం.. ఎస్సైకి తీవ్రగాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Traffic SI | నిజామాబాద్ నగరంలో ఓ వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల ఎస్సై తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్​ బంక్​ (sai reddy petrol pump) వద్ద శనివారం మధ్యాహ్నం సమయంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడిని అడ్డుకోగా.. అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బైకు వెనుక హ్యాండిల్​ను పట్టుకోబోయాడు. ఈ క్రమంలో వాహనదారుడు వేగం పెంచడంతో ట్రాఫిక్​ ఎస్సై రహమతుల్లా కిందపడిపోయారు. దీంతో ఆయన చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.