Maharashtra | టన్నెల్స్‌లో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల‌కి హెచ్చ‌రిక‌.. వేగ ప‌రిమితిని త‌ప్ప‌క పాటించాలి

అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Maharashtra CM Eknath Shinde) ముంబైలోనే అతి పొడవైన ఇంట్రా-సిటీ భూగర్భ రహదారిని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 3.93 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్‌లో ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్(Princess Street Flyover) నుండి ప్రియదర్శని పార్క్(Priyadarshani Park) వరకు విస్తరించి ఉంది. ఇందులో అధునాతన సాంకేతికతతో పాటు నియంత్రణ వ్యవస్థలతో కూడిన సొరంగాలు ఉన్నాయి. అయితే ట‌న్నెల్ లోప‌ల ప్ర‌యాణించే వారికి కొన్ని సూచ‌న‌లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Maharashtra CM Eknath Shinde) ముంబైలోనే అతి పొడవైన ఇంట్రా-సిటీ భూగర్భ రహదారిని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 3.93 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్‌లో ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్(Princess Street Flyover) నుండి ప్రియదర్శని పార్క్(Priyadarshani Park) వరకు విస్తరించి ఉంది. ఇందులో అధునాతన సాంకేతికతతో పాటు నియంత్రణ వ్యవస్థలతో కూడిన సొరంగాలు ఉన్నాయి. అయితే ట‌న్నెల్ లోప‌ల ప్ర‌యాణించే వారికి కొన్ని సూచ‌న‌లు అందించారు అధికారులు.

Maharashtra | ఇవి పాటించండి..

టన్నెల్‌లో (Tunnel) ప్రయాణిస్తున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టన్నెళ్లలో ప్రయాణించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. టన్నెళ్ల లోపల తడిగా ఉన్న నేప‌థ్యంలో టైర్స్ స్కిడ్ అయ్యే ప్ర‌మాదం ఉంది. ఇది ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని వారు తెలిపారు.అందుకే వాహ‌న‌దారులు లేన్ డిసిప్లిన్ పాటించండి అని అధికారులు చెప్పుకొచ్చారు.

అందులో ప్రయాణించేవారు నిర్దిష్ట వేగ పరిమితి (Speed Limit)కి లోబడే ప్రయాణించండి. స‌డెన్‌ బ్రేకింగ్(Sudden braking), లైన్ మార్చడం నివారించండి. ముందున్న వాహనానికి తగినంత దూరంలో ప్ర‌యాణించండి అని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే, ఘోర‌ ప్రమాదాలు ఎదురయ్యే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు(Traffic police) హెచ్చరిస్తున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అందుకని అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ మీ జీవితాన్ని రిస్క్‌లో ప‌డేసుకోకండి.

Related articles

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.

Nizamabad Deputy Mayor | డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సందర్భంగా ఆమెకు మేయర్​ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.