HomeUncategorizedUttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి సంబంధించిన ఘటనలు వింత గొలుపుతుంటాయి.

కామంతో కన్నూమిన్ను కానరాక.. భర్తలను మోసగించే భార్యలు, భార్యలను మోసం చేసే భర్తలు.. సర్వసాధారణం అన్నట్లుగా తరచూ వెలుగు చూడటం ఆందోళనకరం.

తాజాగా మరో విచిత్ర ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళ.. భర్త, తన ఏడుగురు పిల్లలను వదిలి 22 ఏళ్ల తన మేనళ్లుడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాయ్‌బరేలిలో ఉన్న మహారాజ్‌గంజ్ Maharajganj పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి పురే అచ్లి గ్రామంలో ఏడుగురు పిల్లల తల్లి తన 22 ఏళ్ల మేనల్లుడితో పారిపోయింది.

బాధిత భర్త పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Uttar Pradesh : అసలేం జరిగిందంటే..

రాజ్‌కుమార్ పాసి అనే వ్యక్తి ఢిల్లీ Delhi లోని ఫామ్ హౌస్‌ farmhouse లో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 2న రాజ్‌కుమార్ తన భార్య లాల్తిని సొంతూరు పురే అచ్లి గ్రామానికి పంపాడు.

వెంట రూ. 3 లక్షలు ఇచ్చి తోలాడు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న గృహానికి పైకప్పు వేయించడానికి ఈ నగదు ఇచ్చి పంపించాడు.

ఆ తర్వాత వారం రోజులకు రాజ్‌కుమార్ ఊరిలోని తన సోదరులకు ఫోన్​ చేశాడు. ఇంటి పని గురించి ఆరా తీశాడు. వాళ్లు చెప్పింది విని షాక్​ అయ్యాడు.

రాజ్​కుమార్​ భార్య లాల్తి అసలు ఊరికే రాలేదని అతడి సోదరులు చెప్పారు. ఇంటి పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు.

Uttar Pradesh : కోర్టు ద్వారా పెళ్లి చేసుకుందట..

దీంతో బంధుమిత్రుల ద్వారా తన భార్య కోసం తీవ్రంగా వెతకగా.. దేవైచా గ్రామంలో లల్తి దేవి ఆమె మేనల్లుడు ఉదయరాజ్(22) కలిసి ఉన్నట్లు తెలిసింది.

రాజ్​కుమార్​ వెంటనే తన భార్య లాల్తిని వెళ్లి నిలదీశాడు. ఆమె చెప్పింది విని షాక్​ అయ్యాడు. ఉదయ్​రాజ్​ను కోర్టు ద్వారా తాను పెళ్లి చేసుకున్నట్లు లాల్తి చెప్పింది.

ఉదయ్​రాజ్​తోనే ఉండాలనుకుంటున్నట్లు లాల్తి తేల్చి చెప్పింది. తన ఏడుగురి పిల్లల గురించి ప్రస్తావించగా.. బిడ్డలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఏమి చేయాలో పాలుపోని రాజ్​కుమార్​ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Must Read
Related News