HomeUncategorizedBJP leader | ప్రియుడి మాయ‌లో ప‌డి.. క‌న్న‌కూతురి జీవితం నాశ‌నం చేసిన కసాయి తల్లి

BJP leader | ప్రియుడి మాయ‌లో ప‌డి.. క‌న్న‌కూతురి జీవితం నాశ‌నం చేసిన కసాయి తల్లి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BJP leader : క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌ని ఏ త‌ల్లి అయినా ఎంత గారాబంగా చూసుకుంటుంది..? సొంత తల్లి కావాలని ఎక్కడైనా ఘోరం చేయిస్తుందా..? కానీ అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఓ కసాయి తల్లి.

ఆమె ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మహిళా బీజేపీ నేత. సుమిత్ పట్వాల్‌ అనే తన లవర్ తో పాటు మరికొంత మందిని తన కుమార్తెపై అత్యాచారం చేయించింది. మార్చి 2025 వరకు ఎనిమిదిసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రతి సందర్భంలో, తన కుమార్తెకు ఇవన్నీ “సాధారణం” అని చెప్పి ఈ దారుణానికి బలవంతం చేయించినట్లుగా తెలుస్తోంది.

BJP leader : ఈమె త‌ల్లా..

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని హరిద్వార్‌(Haridwar)కు చెందిన సదరు మహిళా నేత చాలా దారుణానికి ఒడిగట్టింది. తన 13 ఏళ్ల కూతురిని ప్రియుడు, అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించింది. ఈ సంఘటన జనవరిలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

ప్రియుడి మాయలో పడి ఆమె తన కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసింది. మహిళ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేలా రెచ్చగొట్టింది. తల్లి చేసిన దారుణం గురించి బాలిక తండ్రికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జరిగిన దారుణం గురించి బాలిక తన తండ్రికి చెప్పడంతో ఆయన షాక్​ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితురాలితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ సుమిత్ పట్వాల్‌, అతడి స్నేహితుడిపై పోలీసులు పొక్సో(POCSO)తో పాటు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలు, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఓ హోటల్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంలో పట్వాల్‌కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో నిందితులు బాలికపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలిక తండ్రిని చంపేస్తామని కూడా వారు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. హరిద్వార్‌తో పాటు ఆగ్రా, బృందావన్‌లో నిందితులు అఘాయిత్యాలకు పాల్పడినట్టు చెప్పారు. ఇక భర్త నుంచి విడిపోయిన మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది.