Homeక్రైంUttar Pradesh | ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

Uttar Pradesh | ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. తాత్కాలిక సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, వివాహేతర సంబంధాల మోజులో పడి హత్యలు చేయడానికి వెనుకాడడం లేదు. ఇటీవల పలువురు మహిళలు ప్రియుడి (boyfriends) కోసం భర్తలను హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మహిళా ఏకంగా కన్న కొడుకునే హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్​లోని వారణాసిలో (Varanasi) చోటు చేసుకుంది.

వారణాసిలో రామ్​నగర్​లో సోనాశర్మ అనే మహిళ నివాసం ఉంటుంది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో కుమారుడు సూరజ్​, కుమార్తెతో కలిసి రామ్​నగర్​లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఫైజాన్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆదివారం సోనా శర్మ ప్రియుడు ఫైజాన్​ను ఇంటికి ఆహ్వానించింది. వారిద్దరు ఏకాంతంగా ఉండగా కుమారుడు సూరజ్​ చూశాడు. దీంతో ఎక్కడ తమ విషయం బయట పెడుతాడోననే భయంతో ఇద్దరు కలిసి బాలుడిని హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు (Police) సోనాశర్మ, ఆమె ప్రియుడు ఫైజాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Uttar Pradesh | మంటగలుస్తున్న మానవత్వం

మానవత్వం మంట గలుస్తోంది. మానవ సంబంధాలు కనమరుగు అవుతున్నాయి. ప్రేమ, వివాహేతర సంబంధాలు, ఆస్తుల కోసం అయిన వారిని అంతం చేయడానికి కూడా కొందరు ఆలోచించడం లేదు. గతంలో పలువురు మహిళలు ప్రియుడితో కలిసి భర్తలను (Husband) హత్య చేసిన విషయం తెలిసిందే. మేఘాలయలో హనీమూన్​కు వెళ్లిన రాజారఘువంశీని అతని భార్య సోనమ్​ హత్య చేసింది. తెలంగాణలో గద్వాల్​కు చెందిన తేజేశ్వర్​ అనే యువకుడిని పెళ్లయిన నెల రోజులకే భార్య ప్రయుడితో కలిసి హత్య చేయించింది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.