అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | తమకు కొడుకు పుట్టాడని ఆ దంపతులు సంతోష పడ్డారు. మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టగా.. రెండో కాన్పులో అబ్బాయి పుట్టడంతో కుటుంబ సభ్యులు (family members) సైతం ఆనంద పడ్డారు. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తల్లి తన కుమారుడిని తనివి తీరా చూడకుండానే తనువు చాలించింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి (under kamareddy municipality, devunpally village) చెందిన దుమాల సునంద-మల్లేష్ దంపతులకు మొదటి కాన్పులో ఆడబిడ్డ జనించింది.
రెండో సారి గర్భం దాల్చిన సునంద బుధవారం డెలివరీ కోసం నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో (private hospital in nizamabad) చేరింది. మధ్యాహ్నం 1 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చిన (gave birth to boy) సునంద కొడుకు పుట్టాడని సంబరపడింది. రాత్రి వరకు కుటుంబ సభ్యులతో బాగానే మాట్లాడిన ఆమెకు రాత్రి 1 గంటకు దమ్ము ఎక్కువైంది. ఆమెను బతికించేందుకు వైద్యులు (doctors) ప్రయత్నించినా ఫలించలేదు. అరగంటలోనే ఆమె మృతి చెందింది. దీంతో దేవునిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.