అక్షరటుడే, వెబ్డెస్క్ : Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
పెబ్బేరుకు చెందిన ప్రకాశ్ కుటుంబంతో సహా కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉండేవాడు. ఆయన దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది నవంబర్లో గుండెపోటుతో (heart attack) ప్రకాశ్ చనిపోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రసన్న(40), కుమారుడు (15), కుమార్తెతో కలిసి ఉంటుంది. అయితే భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ప్రసన్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అన్నంలో పురుగుల మందు కలుపుకొని ముగ్గురు తిన్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ప్రసన్న, ఆమె కుమార్తె మేఘన చనిపోయారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
Nagarkurnool | నంద్యాలలో..
ఏపీలోని నంద్యాల జిల్లా (Nandyal district) ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర(35) తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన భార్య మృతి చెందడంతో పిల్లలను చూసుకులేక సురేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Nagarkurnool | ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి..
హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్టియర్ విద్యార్థి రామ్ చరణ్ (17) హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. యాజమాన్యం వేధింపులతోనే రామ్ చరణ్ సూసైడ్ చేసుకున్నాడని స్నేహితులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.