అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ Hyderabad లోని హయత్నగర్లో hayat nagar విషాదం చోటు చేసుకుంది. దోమల బెడద తప్పించుకోవడానికి వెలిగించిన దోమల కాయిల్ Mosquito coil ఓ బాలుడి ప్రాణం తీసింది. ఇంట్లో దోమలు పొవడానికి కుటుంబీకులు కాయిల్ వెలిగించి పెట్టారు. అయితే ఆ కాయిల్ పరుపు మీద పడి గదిలో పొగ వ్యాపించడంతో ఊపిరాడక రెహమాన్(4) అనే బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు అబ్దుల్ (5) పరిస్థితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు నీలోఫర్ ఆస్పత్రికి Nilofar Hospital తరలించారు.
