ePaper
More
    Homeఅంతర్జాతీయంFifa World Cup | ఏంటి.. ఏకంగా 30 ల‌క్ష‌ల కుక్క‌ల‌ను చంపేందుకు స‌ర్కారు నిర్ణ‌యం...

    Fifa World Cup | ఏంటి.. ఏకంగా 30 ల‌క్ష‌ల కుక్క‌ల‌ను చంపేందుకు స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుందా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Fifa World Cup | ఈ మ‌ధ్య వీధి కుక్క‌ల‌తో చాలా మందికి పెద్ద స‌మ‌స్యే వ‌చ్చింది. అవి మ‌నుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. అయితే ఓ దేశం ఏకంగా 30 లక్షల వీధి కుక్కలను చంపేందుకు ప్లాన్ చేసింది. దీంతో జంతు ప్రేమికులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2030లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్‌(Fifa World Cup)కు ముందు మొరాకో దాదాపు 30 లక్షల కుక్కలను చంపాలని యోచిస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ మూడు దేశాలలో జరగనున్న తదుపరి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం మొరాకోలోని పలు నగరాలు సిద్దమవుతున్నాయి.

    Fifa World Cup | ఎలా చంపుతారంటే..

    ఫుట్‌బాల్ Football అభిమానులకు మరింత అందంగా కనిపించేలా చేయడానికి ఈ దేశాలు కుక్కలను(Dogs) వధించడం ‘క్లీన్-అప్’ ప్రక్రియగా చేపట్టబోతున్నాయి. ఉత్తర ఆఫ్రికా దేశంలోని పలు ప్రదేశాల్లో కుక్కలను వధించడం ప్రారంభించినట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 2030 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్స్‌కు వేదిక ఇంకా ఖరారు కాకముందే.. మొరాకో ఇలాంటి చర్య చేపట్టింది. ముఖ్యంగా టోర్నమెంట్ 100వ వార్షికోత్సవం కావడంతో.. 2030 ప్రపంచ కప్‌కు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే వీధి కుక్కలను(Street dogs) అంతమొందించాలనే ప్రణాళిక విష‌యంలో పెస్టిసైడ్‌గా ఉపయోగించే అత్యంత విషపూరిత రసాయనమైన స్ట్రైక్‌నైన్‌(poisonous chemical strychnine)తో కుక్కలను చంపేయనున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

    మొరాకో(Morocco) అంతటా ఇప్పటికే వేల సంఖ్యలో వీధికుక్కలు చంపారని, మరెన్నో కుక్కలకు ముప్పు పొంచి ఉన్నాయని జంతు సంక్షేమ సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యానిమల్ కోయలిషన్ కొన్ని క్రూరమైన పద్ధతుల గురించి తెలిపింది. ఇందులో స్ట్రైక్నైన్‌తో విషప్రయోగం, కాల్పులు వంటి ఉన్నాయి. కుక్కలను బిగించే పరికరాలతో బంధించి వాటిని అమానవీయంగా చంపి, రవాణా చేస్తారు. ఇందులో చాలా జంతువులు గాయపడిన తర్వాత తీవ్రమైన నొప్పితో చనిపోతాయని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ జంతు కూటమి(International Animal Federation) ఈ హత్యలను నివారించేందుకు ‘మొరాకోస్ అగ్లీ సీక్రెట్(Morocco’s ugly secret)’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...