అక్షరటుడే, న్యూఢిల్లీ: Airports closed.. X accounts blocked : భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎక్స్(ట్విట్టర్) ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎనిమిది వేలకు పైగా ఎక్స్ ఖాతాలను మూసివేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
ఇక పాక్ దాడి యత్నాలు విఫలం చేసిన భారత్.. దేశంలోని 27 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా , సిమ్లా, కులు ఉన్నాయి.
