- Advertisement -
Homeబిజినెస్​Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వేగంగా డెలివరీలు.. మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌లోకి ఎంట్రీ..

Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వేగంగా డెలివరీలు.. మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌లోకి ఎంట్రీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Flipkart | దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) మార్కెట్‌లో వాటా మరింత పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్విక్‌ కామర్స్‌(Quick commerce) బిజినెస్​లోకి ఎంటరయ్యింది. సరుకులను మరింత వేగంగా డెలివరీ చేయడం కోసం ఫ్లిప్‌కార్ట్‌ మినట్స్‌(Flipkart minutes) పేరుతో సేవలు ప్రారంభించింది. ఎంపిక చేసిన ప్రాంతాలలో 16 నిమిషాలలోపు డెలివరీలు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌ మినట్స్‌ అనేది ఫ్లిప్‌కార్ట్‌ అందించే హైపర్‌ లోకల్‌ క్విక్‌ కామర్స్‌ సర్వీస్‌. ఎలక్ట్రానిక్స్‌(Electronics), గృహ అవసరాలు, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు(Vegetables), మాంసం, ఇతర నిత్యావసర వస్తువులను వేగంగా డెలివరీ చేయడం కోసం ఈ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది జిప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌(Instamart), బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి ఇతర క్విక్‌ డెలివరీ సర్వీస్‌లతో పోటీ కోసం ఈ సర్వీస్‌ను తీసుకువచ్చింది. ఆర్డర్‌ చేసిన తర్వాత 8 నుంచి 16 నిమిషాలలో డెలివరీ చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ సర్వీస్‌ కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

- Advertisement -

Flipkart | అందుబాటులో ఉన్న ప్రాంతాలు..

ఫ్లిప్‌కార్ట్‌ మినట్స్‌ సర్వీస్‌ ప్రస్తుతం బెంగళూరు (హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌, బెల్లందూర్‌, గుంజూర్‌, కడుబీసనహళ్లి వంటి ప్రాంతాలు), గురుగ్రామ్‌, Delhi ఎన్‌సీఆర్‌, ముంబయి (పోవై, మాటుంగా, మహిమ్‌, వర్లీ), థానే (వసంత్‌ విహార్‌, పచ్‌ పఖడి, మనపడ, మజివాడ) వంటి నగరాలలో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సర్వీస్‌లను విస్తరించే అవకాశాలున్నాయి. పండుగ సీజన్‌(Festive season) నాటికి మరికొన్ని ప్రధాన నగరాలలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Flipkart | డెలివరీ ఛార్జీలు..

99 రూపాయలపైన ఆర్డర్‌లకు ఉచిత డెలివరీ(Free delivery) అందుబాటులో ఉంది (ఫ్లిప్‌కార్ట్‌ వీఐపీ, ప్లస్‌, ప్లస్‌ ప్రీమియం సభ్యులకు). రూ.99 కంటే తక్కువ ఆర్డర్‌లకు రూ. 30 డెలివరీ చార్జీతోపాటు 5 రూపాయల ప్లాట్‌ఫాం ఫీ వసూలు చేస్తోంది.

Flipkart | మినీ వేర్ హౌస్​ల ద్వారా..

సరుకులను వేగంగా డెలివరీ చేయడం కోసం ఈ సర్వీస్‌ డార్క్‌ స్టోర్స్‌ (మినీ వేర్‌హౌస్‌లు) ద్వారా అందిస్తోంది. ఈ ఏడాది ఫెస్టివ్‌ సీజన్‌ వరకు 100 డార్క్‌ స్టోర్స్‌(Dark stores)ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉంది.

ఇతర అంశాలు:ఫ్లిప్‌కార్ట్‌ మిట్స్‌ ఆర్డర్‌ను రద్దు చేయడానికి లేదా డెలివరీ తీసుకోకపోవడానికి కస్టమర్‌కు స్వేచ్ఛ ఉంది. రూ. 2,500 లపైన చేసే చెల్లింపులకు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News